బస్సు టికెట్ చార్జీలు పెరిగాయని ప్రచారంలో వాస్తవం లేదని ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. దీపావళి తిరుగు ప్రయాణం నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో మాత్రమే జీవో ప్రకారం చార్జీలను సవారించాం. తిరుగు ప్రయాణంలో రద్దీ ఉండకపోవడంతో బస్సులు ఖాళీగా వెళ్తుంటాయి. కనీసం డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని 2003లో ప్రభుత్వం జీవో 16 తీసుకొచ్చింది అని వివరించారు.