భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. ఎక్కడ చూసినా బస్తీలు నీటితో నిండిపోయాయి. రహదారులు ఏకంగా చెరువులను తలపిస్తున్నాయి. చాధర్ ఘాట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గమ్యం ఎలా చెరుకోవాలన్న ఆలోచనలో పడ్డారు. సకాలంలో డ్రైనేజీ నాలాల్లో పూడిక తీయకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు మండిపడుతున్నారు.