గ్రేటర్ లో నలుగురు మేయర్లు
హైదరాబాద్ నగరంలో జనాభా భారీగా పెరిగిపోయారని గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అందుకే జీహెచ్ఎంసీని విభజించి నాలుగు మేయర్ స్థానాలు ఏర్పాటు చేయాలనే అంశం తమ పరిశీలనలో ఉందని తెలిపారు. అలాగే మరో రెండు రోజుల్లో రీజినల్ రింగు రోడ్డుకు టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో హైదరాబాద్ రూపురేఖలు మారబోతున్నాయని పేర్కొన్నారు.