తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామ భజన మండలి సభ్యులు ఆదివారం సోమశిల జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. కార్తీక మాసంలో నెల రోజులపాటు ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక భజనలు చేసిన సభ్యులు ప్రతి ఏటా ఆలయాల దర్శన చేసుకొనున్నట్లు వారు వివరించారు. అందులో భాగంగా సోమశిల ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలకిష్టయ్య, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.