చేప పిల్లల పంపిణీలో ప్రభుత్వం జ్యాపం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి. సబితారెడ్డి అన్నారు. రావిర్యాల చెరువులో మంగళవారం చేప పిల్లలను వదిలారు. జూన్, జూలై నెలల్లోనే చేప పిల్లలను పంపిణీ చేసి ఉంటే ఇప్పటికి వాటి ఎదుగుదల ఉండేదన్నారు. ఇప్పుడు పంపిణీ చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. గత ప్రభుత్వంలో చేప పిల్లల పంపిణీ విషయంలో నిర్లక్ష్యం చేయలేదన్నారు.