ఆమనగల్లు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని నాలుగు మండలాల్లో ఫంక్షన్ హాల్ లు, ఫామ్ హౌస్ లలో లిక్కర్ పార్టీలు చేసుకునేవారు ఈవెంట్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్య చౌహన్ చెప్పారు. ఆదివారం మాట్లాడుతూ అనుమతి కోసం 9,000 రూపాయలు ఆన్ లైన్ లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.