కల్వకుర్తి నియోజకవర్గం లోని బైరాపూర్ గ్రామ సైదులు దర్గాలో నూతనంగా నిర్మించిన భక్తుల ప్రాంగణం హాల్ ను ఆదివారం రాష్ట్ర టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రారంభించారు. భక్తులు, గ్రామస్తుల వినతి మేరకు ఆయన అందించిన రెండున్నర లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టి హాల్ పూర్తి చేసినట్లు వారు వివరించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసారు.