దారి దోపిడీకి పాల్పడిన ముగ్గురిని రిమాండ్ కు తరలించిన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 17న రమేష్ అనే వ్యక్తి రాత్రి 10 సమయంలో అల్కాపురి వద్ద రోడ్డు దాటుతుండగా ఆటోలో ముగ్గురు వచ్చి రమేష్ ను బెదిరించి అతని వద్దనున్న ఫోన్, పర్స్ లాక్కొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించి రిమాండ్ కు తరలించారు.