గత పదేళ్ల కాలంలో అధికారంలో ఉన్న వాళ్లు ఎల్బీనగర్లో అభివృద్ధిని పట్టించుకోలేదని, కానీ రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తుంటే రాజకీయాలు చేస్తూ అడ్డుకోవాలని చూస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ విమర్శించారు. హస్తినాపురం డివిజన్లోని సప్తగిరి హిల్స్ కాలనీలో కార్పొరేటర్ సుజాత నాయక్ తో కలిసి మధుయాష్కి గౌడ్ పర్యటించారు. సమస్యలు తెలుసుకున్నారు. సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ శంకుస్థాపన చేశారు.