అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సీఎంరిలీఫ్ ఫండ్ పేదల ఆరోగ్యానికి భరోసా అన్నారు.