చిన్నారిని ఢీకొట్టిన కారు.. స్వల్ప గాయాలు

62பார்த்தது
చిన్నారిని ఢీకొట్టిన కారు.. స్వల్ప గాయాలు
రోడ్డుపై ఆడుకుంటున్న ఓ చిన్నారిని కారు ఢీకొట్టిన ఘటన హయత్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హయత్ నగర్ వీరభద్ర కాలనీలో నివాసముండే ధనుంజయ కుమారుడు ఆయాన్స్ రోడ్డుపై ఆడుకుంటుండగా గుర్తు తెలియని కారు ఢీ కొట్టడంతో తల, పెదవులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేశామన్నారు.

தொடர்புடைய செய்தி