అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షునిగా మొయినాబాద్ మండల్, ముర్తుజాగుడ గ్రామానికి చెందిన పెరమోని లక్ష్మీపతి యాదవ్ ని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు ఐలబోయిన రమేష్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా లక్ష్మీపతి యాదవ్ మాట్లాడుతూ అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా యువజన అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు గాను సంతోషంగా ఉంది అన్నారు. నా పై నమ్మకం ఉంచి జిల్లా యువజన విభాగం అధ్యక్షునిగా నియమించినందుకు అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబు రావు యాదవ్ కి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ కి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల రవీందర్ యాదవ్, ఉపాధ్యక్షులు ఎం బాలమల్లేష్ యాదవ్, రాష్ట్ర కోశాధికారి దారబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రమేష్ యాదవ్ , జాతీయ యువజన కోఆర్డినేటర్ గొర్ల యశ్వంత్ యాదవ్ కి మరియు సహకరించిన ప్రతిఒక్కరికీ ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.
యాదవ సంస్కృతిని కాపాడే విధంగా తగిన కృషి చేస్తానని, పాడి పాషువులకు సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు యాదవులకు లబ్దిపొందే విధంగా తగు చర్యలు తీసుకుంటామని అలాగే జిల్లా రాష్ట్ర యువజన అధ్యక్షులు ఆదేశాలమేరకు ప్రతి మండలంలోని యువ యాదవుల అభ్యునతికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే రాబోవు రోజులో కొత్త కమిటీని ప్రకటిస్తామని లక్ష్మీపతి యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బద్ధుల బాబు రావు యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల రవీందర్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేందర్ యాదవ్, రాష్ట్ర కోశాధికారి దారబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రమేష్ యాదవ్ , జాతీయ యువజన కోఆర్డినేటర్ గొర్ల యశ్వంత్ యాదవ్, రాష్ట్ర యువజన కార్యదర్శి ఏషం మల్లేష్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ యువజన అధ్యక్షులు ఎం విజయ్ యాదవ్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బద్దుల సుధాకర్ యాదవ్, వినోద్ యాదవ్, రవీందర్ యాదవ్, శ్యామ్ యాదవ్, బొడుసు సాయి యాదవ్, కుమార్ యాదవ్ తదితరులు పాల్గోన్నారు.