టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆర్ లక్ష్మణ్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం కలిపించింది. గత ముపై సంవత్సరాలుగా పార్టీకి సేవలందించిన సందర్భంగా లక్ష్మణ్ యాదవ్ ను గుర్తించి పార్టీ ఆయనకు టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించడం అర్శనియం. అంబర్ పెట్ నియోజికవర్గానికి మొదటి సారిగా పిసిసి ప్రధాన కార్యదర్శి కేటాయించడం అందులో అందరినీ ఆప్యాయంగా తన చిరునవ్వుతో పలకరించే లక్ష్మణ్ యాదవ్ ను నియమించడం అంబర్ పెట్ పార్టీ కార్యకర్తలు సంతోషం వెక్తం చేశారు. మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంత్ రావుకు ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందిన ఆయనకు కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగించడం పై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ యాదవ్ మట్లుడుతు పార్టీని నమ్ముకుని కష్టపడి పని చేసేవారికి కచ్చితంగా అవకాశం కల్పిస్తుంది అని ఆయన తెలిపారు. టీపిసిసి ప్రధాన కార్యదర్శిగా తనకు అవకాశం కల్పించినందుకు మరింత ఉత్సహంగా పనిచేస్తానని ఆయన అన్నారు. తన నియామకానికి సహకరించిన టీపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంత్ రావు గారికి, మాజీ కేంద్ర మంత్రివర్యులు అరుణ్ యాదవ్ గారికి, ఇంఛార్జి కార్యదర్శి బోసు రోజు గారికి, ఇతర ముఖ్యనేతలఅందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకులకు కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండి పార్టీ బలోపేతం కోసం తాను తగిన కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
అనంతరం మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంత్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. హనుమంత్ రావు సమక్షంలోనే అంబర్ పెట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా, యువజన మరియు ఎన్ ఎస్ యు ఐ నాయకులు లక్ష్మణ్ యాదవ్ గారికి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.