అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఇబ్రహీంపట్నంకు చెందిన బర్ల జగదీశ్వర్ యాదవ్ ను మరియు ప్రధాన కార్యదర్శిగా షాద్నగర్ కు చెందిన నడికుడి రఘునాథ్ యాదవ్ ను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబు రావు యాదవ్. ఈ సందర్బంగా బాబు రావు యాదవ్ మాట్లాడుతూ కొత్తగా నియమితులైన రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కి శుభాకాంక్షలు తెలుపుతూ వారికి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయిలో ఉత్సాహవంతులైన యాదవులను గుర్తించి వారికి పదవులు ఇవ్వాలని సూచించారు. అలాగే గ్రామ స్థాయిలో ఆపదలో ఉన్న ప్రతి యాదవుని వెంట నిలవాలని వారిని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎం అంజయ్య యాదవ్, రాష్ట్ర యువజన అధ్యక్షులు ఏ రమేష్ యాదవ్, జాతీయ యువజన కోఆర్డినేటర్ గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి బాలారాజ్ యాదవ్, నారాయణ యాదవ్, రంగారెడ్డి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, రాష్ట్ర యువజన కార్యదర్శి యేషాం మల్లేష్ యాదవ్, ఇబ్రహీంపట్నం యాదవ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.