రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం194 మోడల్ స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 6 నుంచి ఆన్‌లైన్ దరఖా స్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.