చార్మినార్ వద్ద అర్థరాత్రి కూడా తగ్గని భక్తుల రద్దీ
గత రెండు రోజులుగా చార్మినార్ కిటకిటలాడుతోంది. దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం అర్ధరాత్రి 12 దాటిన 3 వేల మంది భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు. దీంతో చార్మినార్ ఆవరణ అంతటా సందడిగా మారింది. శనివారం కూడా భక్తుల రద్దీ ఇలాగే కొనసాగనుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. మరోవైపు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.