హైదరాబాద్ నగరంలోని అన్ని జోన్ల నుంచి వచ్చిన సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీలతో బంజారాహిల్స్ లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సమావేశం నిర్వహించారు. ఇక ముందు కూడా ఆయా ప్రాంతాల్లో పీస్ వెల్ఫేర్ కమిటీ సభ్యులుగా కొనసాగుతూ అవసరమైన సేవలు అందించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు స్థానిక పోలీసులకు సహకరించాలని కమిటీ సభ్యులకు సూచించారు. కమిటీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.