రేవంత్ రెడ్డిని ఫోటో తీస్తూ మూసీలో పడ్డ ఫోటోగ్రాఫర్
నీటి కాలుష్యాన్ని పరిశీలించేందుకు మూసీ కాలువ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఫోటో తీసేందుకు ప్రయత్నించి ఓ ఫోటోగ్రాఫర్ మూసీలో పడిపోయారు. వెంటనే సమీపంలో ఉన్నవారు అతడిని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా, వలిగొండ మండలంలోని సంగెం గ్రామంలో సీఎం రేవంత్ మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర శుక్రవారం మధ్యాహ్నాం నుంచి ప్రారంభమైంది. భీమలింగం వరకు 2.5 కి.మీ మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది.