కిషన్ బాగ్ పరిధిలోని మూసి పరివాహక ప్రాంతాల్లో బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా హైడ్రా బాధితులు తమ గోడును ఎమ్మెల్యేకు వివరించారు. తమ ఊరిలో భూములు అమ్ముకొని తాము ఇక్కడ ఇళ్లు కట్టుకున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. పేద ప్రజలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మేల్యే వారికి హామీ ఇచ్చారు.