కుటుంబ డిజిటల్ కార్డుల పంపిణీ సమయంలో కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే కుటుంబం ఫొటో తీయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ ఫొటో ఆప్షనల్ మాత్రమేనని పేర్కొన్నారు. “అక్టోబరు 3 నుంచి 7 వరకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు, 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలన్నారు. కొత్త సభ్యులకు జతచేసి, చనిపోయిన వారిని తొలగించాలని సీఎం సూచించారు.