బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సంచలన ప్రకటన చేశారు. వారంలోగా ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోతే చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నాలుగు వేల మంది విద్యార్థులతో ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట మూడు రోజులు ధర్నా చేస్తామని ప్రకటించారు.