TG: BRS మాజీ MLA జీవన్ రెడ్డి 114 ఎకరాల ల్యాండ్ కబ్జా కేసులో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని మోకిలా PSకు హాజరయ్యారు. గతంలో ల్యాండ్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదుతో జీవన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్‌తో పాటు, అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో, జీవన్ రెడ్డి శుక్రవారం మోకిలా PSలో హాజరయ్యారు.