దేశంలో పలు ప్రాంతాల్లో సేవలందించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా వంటి ఆరు కొత్త మార్గాల్లో సేవలు అందించనున్నాయి. 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిత్యం 120 ట్రిప్పులతో వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.