పెద్దపల్లి: కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి - మంత్రి ఉత్తమ్
ప్రణాళిక ప్రకారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. శనివారం సచివాలయం నుంచి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కొనుగోళ్లకు తీసుకోవాల్సిన చర్యలపై పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డిఎస్ చౌహన్ సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.