జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం రవాణాకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అవసరమైన వాహనాలు సమకూర్చాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్ లో శనివారం ధాన్యం రవాణాపై అదనపు కలెక్టర్ వేణుతో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.