రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేశామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివారం ఓదెల మండలం, ఉప్పరపల్లి, గోపరపల్లి, హరీపురం, లంబాడితండా, నాంసానిపల్లి, అబ్బిడిపల్లి, కొమిరే గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ళ సుమన్ రెడ్డి, డైరెక్టర్లు, మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి పాల్గొన్నారు.