ఉత్తరప్రదేశ్లో భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. కన్నౌజ్ జిల్లాలోని లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై అతివేగంగా వెళుతున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది గాయపడ్డారు. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఉన్నత ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బిహార్ నుంచి పంజాబ్ వెళ్తున్న స్లీపర్ బస్సు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్ను ఢీకొట్టిన బస్సు బోల్తా పడింది.