నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జెడ్పి హైస్కూల్ లో చేపట్టిన పనులను పరిశీలించి, డిజిటల్ తరగతుల నిర్వహణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు, పంచాయతీరాజ్ ఈ. ఈ శంకర్ ఉన్నారు.