నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ ఏఐటీయూసీ 105 వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులకు కనీస వేతనాలు, పనిగంటలు, పని భద్రత ఉండాలని భారత దేశ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాడి చట్టాలు సాధించి పెట్టిన ఏకైక సంఘం ఏఐటీయూసీ అని అన్నారు.