బాల్కొండ: ఎస్సారెస్పీ వరద నీటిని ఇందిరమ్మ కాలువలోకి శుక్రవారం విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఇందిరమ్మ కాలువలోకి 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాబట్టి ఇందిరమ్మ కాలువ వైపు చేపలు పట్టేవారు, పశువుల కాపరులు ఎవరు వెళ్లవద్దని హెచ్చరించారు.