వేల్పూర్ మండల కేంద్రంలో శనివారం పలు గ్రామాలలో బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మరోవైపు ఏడాది వర్షాలు అంతగా కురవడం లేదని రైతన్నలు కాస్త దిగులు చెందుతున్నారు. ఇకనైనా సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని రైతన్నలు కోరుకుంటున్నారు.