మాక్లూర్ మండలం చిక్లిలో మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వ్యాదులు గురించి మలేరియా యూనిట్ అధికారి గోవర్దన్ అవగాహన కల్పించారు. అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులను కోరారు. ఇళ్ల పరిసరాలు, మురుగు కాలువలు శుభ్రంగా ఉంచాలని, లేదంటే వ్యాధి కారకాలు ఇబ్బందికి గురి చేస్తాయని హెచ్చరించారు.