రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం అయిలాపూర్ సొసైటీ ఆధ్వర్యంలోని పిపిసి నందిపేటలో వరి కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ సిద్దాపురం సుదర్శన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్, డైరెక్టర్లు, సెక్రటరీ నరహరి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద మహిపాల్, విడిసి సభ్యులు మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.