మహిళలకు ఉచిత ప్రయాణం హామి అమలు ఆర్టీసీపై పెను భారం మోపబోతుందని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధినేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 'ఇది ఆర్టీసి కార్మికుల జీవితాలపై కూడ ప్రభావం చూపబోతుంది. గతంలో చాల గ్రామాలకు బస్సులను బంద్ చేశారు. వాటిని పునరుద్ధరిస్తారా అనేది కూడ ప్రశ్నార్థకంగా మిగిలింది. ఆటో డ్రైవర్లు తమకు ప్యాసింజర్లు దొరకక రోడ్ల మీద పడతామేమోనని భయపడుతున్నారు. వారిని కూడ ప్రభుత్వమే ఆదుకోవాలి అని ట్వీట్ చేశారు.