పీఆర్టీయూ ఆలూర్ మండలశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులుగా ఎన్నికైన ఆలూర్ మండల నాయకులకు శుక్రవారం సన్మాన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా గుంట శ్రీనివాస్ రెడ్డి , గాండ్ల రామచంద్రర్, మరియు మహమ్మద్ అశ్ఫాక్ అహ్మద్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శ్రీ బాబన్న, నాగభూషణం , గంగాధర్, యోగేష్, రాష్ట్ర కార్యదర్శులుగా పి నరేందర్, సుధాకర్ ఎన్నికైనట్లు ఆలూర్ మండల ప్రధాన కార్యదర్శి జిందం శివకుమార్ తెలిపారు.