బాసర: సమయానికి బస్సులు రాక భక్తులకు తప్పని తిప్పలు
బాసర సరస్వతి అమ్మవారిని ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో సమయానికి బస్సులు రాక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు బైంసా వైపు వెళ్లే బస్సులు రాక ఆలయం ముందర ప్రధాన రహదారిపై భక్తులు గంటల పాటు వేచి ఉన్నారు. అధికారులు అరగంటకు ఒకసారైనా బైంసా-నిజామాబాద్ వైపు బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.