బాసర గ్రామస్థులకు తెలియకుండా గ్రామ సభ నిర్వహించడంపై మండిపాటు

59பார்த்தது
బాసర గ్రామస్థులకు తెలియకుండా గ్రామ సభ నిర్వహించడంపై గ్రామస్తుడు జంగం రాజేందర్ శనివారం మండిపడ్డారు. గ్రామస్థులకు తెలియకుండా అధికారులే గ్రామసభ నిర్వహించుకుని లెక్కలు తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలా ఉపాధి కూలీలకు, గ్రామస్థులకు తెలియకుండా సభ నిర్వహించడం సమంజసం కాదన్నారు. ఈ సభను తక్షణమే రద్దుచేసి సోమవారం ప్రజలకు తెలియజేసి నిర్వహించాలని తెలిపారు.