తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ గౌడ్ కోరారు. ఆదివారం భైంసాలో ఏర్పాటు చేసిన ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, ఇందిరమ్మ ఇండ్లలో 10 శాతం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ కొట్టే శేఖర్ తదితరులు పాల్గొన్నారు.