విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయాలని ఆర్ఎస్ఎస్ ప్రముఖులు లింగన్న చారి బెజ్జంకి శ్రీనివాస్ చార్యులు అన్నారు. బుధవారం రోజు భైంసా పట్టణంలో ఇటీవల నిర్మల్ జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ అమ్ముల సాగర్ ను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండే విధంగా మన జాతి అభివృద్ధి కోసం పాటుపడాలని వారు సూచించారు.