ఆర్టీసీ సిబ్బందిని అభినందించిన ఎండి సజ్జనార్

51பார்த்தது
ఆర్టీసీ సిబ్బందిని అభినందించిన ఎండి సజ్జనార్
ఈ నెల 9న బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో గుండెనొప్పితో బాధపడుతున్న విద్యార్థికి సకాలంలో వైద్య సహాయం అందించి ఉదారత చాటుకున్న భైంసా డిపో కండక్టర్ గంగాధర్, డ్రైవర్ గంగాధర్ ను బుధవారం హైదరాబాదు బస్ భవన్ లో ఎండి సజ్జనర్ ఘనంగా సన్మానించి నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడమే కాకుండా ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు.

தொடர்புடைய செய்தி