కుంటాల మండల కేంద్రంలోని ఆయా కాలనీల్లో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవిని భక్తులు శనివారం సంప్రదాయంగా శోభయాత్రను ప్రధాన వీధులగుండా ఘనంగా కొనసాగుతుంది. శోభయాత్రలో బాజా బజంత్రీలతో మధ్య యువతీ యువకులు ఆటపాటలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు మండపాల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.