తెలంగాణ గ్రామీణ బ్యాంకు అందిస్తున్న ఇన్సూరెన్స్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ మేనేజర్ అభిలాశ్ అన్నారు. భైంసా మండలం మహాగాం గ్రామానికి చెందిన దేవాకర్ నాగన్న రూ. 500 తో ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకుని ఇటీవల ప్రమాద వశాత్తు నీటి ట్యాంకులు పడి మృతి చెందాడు. దీంతో నామిని భార్య లలితకు బుధవారం రూ. 10లక్షల బీమా చెక్కును జేశారు. బాధిత కుటుంబానికి గ్రామీణ బ్యాంక్ బాసటగా నిలిచిందని ఆయన అన్నారు.