భైంసా మార్కెట్లో పత్తి కొనుగోలు సజావుగా కొనసాగుతున్నాయి. సోమవారం ప్రైవేటు పత్తి ధర రూ. 6, 850, సీసీఐలో పత్తి ధర రూ. 7, 521 ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. శనివారంతో పోలిస్తే ప్రైవేటు, సీసీఐలో ధరలలో ఎలాంటి మార్పు లేదు. కనీస మద్దతు ధర రూ. 10 వేలు చెల్లిస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు కోరుతున్నారు.