పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల భైంసా పట్టణంలో భద్రత ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈద్గా, మసీదులతో పాటు ముఖ్యమైన ప్రదేశాలలో దాదాపు 350 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. ఆమెతో పాటు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.