హిందూ దేవాలయాలు, విగ్రహాలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం భైంసా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఏఎస్పి అవినాష్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ దేవాలయాలు, విగ్రహాలపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.