భైంసా పట్టణంలో ఆదివారం దుర్గా దేవి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ పట్టణంలోని పురాణ బజార్ సర్వజనిక్ దుర్గా దేవి వద్ద పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.