భైంసా పట్టణ పోలీస్ కార్యాలయంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ సమగ్రత, ఐక్యత, భద్రతను కాపాడేందుకు అంకితమవుతానని, దేశ అంతర్గత భద్రతను పటిష్ట పరిచేందుకు స్వీయ తోడ్పాటు అందిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ గోపీనాథ్, ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.