కోతుల దాడిలో మహిళకు గాయాలు

71பார்த்தது
ఖానాపూర్ పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం సమీపంలో కోతుల దాడిలో ఒక మహిళ గాయపడింది. స్థానికుల కథనం ప్రకారం ఆ మహిళ చాకలి పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తోంది. గురువారం కూడా ఆమె రోజువారి పని నిమిత్తం వెళ్ళగా కోతులు దాడి చేయడంతో ఆ మహిళకు గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు ఆమెను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పట్టణంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు తెలిపారు.

தொடர்புடைய செய்தி