జన్నారంలోని కవ్వాల్ అభయారణ్యంలో లక్షెటిపేట కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ అసదుల్లా షరీఫ్ పర్యటించారు. సోమవారం ఆయన అటవీ శాఖ అధికారులతో కలిసి ఫారెస్ట్ ను సందర్శించారు. అటవీ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను అటవీ అధికారులు వివరించారు. ప్రకృతిని, అడవులను, వన్యప్రాణులను కాపాడాలని ఆయన సూచించారు. ఆయనతో పాటు ఇన్చార్జ్ ఎస్ఆర్వో సుష్మారావు, అటవీ అధికారి తిరుపతి ఉన్నారు.