సదర్ మాట్ నీటిని చెరువులలో నింపాలి

84பார்த்தது
సదర్ మాట్ నీటిని చెరువులలో నింపాలి
సదర్ మాట్ లో ప్రస్తుతం ఉన్న నీటిని చెరువులకు విడుదల చేసి ఆయకట్టుకు సాగునీటిని అందించాలని సదర్ మాట్ కాలువ సాధన సమితి అధ్యక్షులు రాజేందర్ హపావత్ కోరారు. వర్షాకాలం ప్రారంభమై 45 రోజులు కావస్తున్న వర్షాలు సరిగ్గా కురవలేదన్నారు. ఖానాపూర్, కడెం మండలాల రైతులు వరి నారును వేసి సాగు నీటి కోసం ఎదురుచూస్తున్నారన్నారు. సదర్ మాట్ లో ఉన్న నీటిని చెరువులలో నింపితే భూగర్భ జలాలు పెరిగి ఆయా పంటలకు నీరందుతుందన్నారు.

தொடர்புடைய செய்தி